Ts Assembly: సమావేశాలు పొడిగించాలని కాంగ్రెస్ నేతలు అడగలేదు: ప్రశాంత్‌రెడ్డి

బడ్జెట్ సమావేశాల్లో 103 మంది సభ్యులున్న తమ పార్టీ కంటే 13 మంది సభ్యులున్న మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల సభ్యులకే ఎక్కువగా అవకాశం ఇచ్చామని శాసనసభా వ్యవహారాల

Published : 16 Mar 2022 02:09 IST

హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల్లో 103 మంది సభ్యులున్న తమ పార్టీ కంటే 13 మంది సభ్యులున్న మజ్లిస్, కాంగ్రెస్ పార్టీల సభ్యులకే ఎక్కువగా అవకాశం ఇచ్చామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా సాగాయని.. తక్కువ రోజుల్లో ఎక్కువ సమయం సభ జరిగినట్లు చెప్పారు. సగటున 8 గంటలు, ఒక్కోరోజు 12 గంటల పాటు అసెంబ్లీ సాగిందని వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కంటే ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు ఎక్కువ సమయం తీసుకున్నారని వెల్లడించారు.

‘‘కీలకమైన ఉద్యోగ నియామకాల ప్రకటనతో పాటు వివిధ వర్గాలకు పనికొచ్చేలా సీఎం కేసీఆర్ నిర్ణయాలు ప్రకటించారు. అయితే, ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తమ పోరాట ఫలితమని చెప్పుకునే దీనస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రజాసమస్యలపై మాట్లాడలేక కేంద్ర వైఖరి, భాజపాని ఎండగడతామని తెలిసే ఆ పార్టీ సభ్యులు సస్పెన్షన్‌కు గురయ్యేలా వ్యవహరించారు. సమావేశాలు పొడిగించాలని కాంగ్రెస్ నేతలు అడగలేదు. సభ నడుస్తున్న సమయంలో కాంగ్రెస్ నుంచి మొక్కుబడిగా ఒక్క సభ్యుడు మాత్రమే సభలో ఉండేవారు. ఒక్క వాకౌట్, నిరసన లేకుండా సమావేశాలు జరిగినందుకు అన్ని పార్టీలకు కృతజ్ఞతలు’’ అని ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని