Andhra News: విధ్వంసాలు సృష్టిస్తే మాత్రం సహించేది లేదు: మంత్రి రోజా

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు విషయంలో ప్రతిపక్షాల తీరును రాష్ట్ర మంత్రి రోజా తప్పుబట్టారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టే విషయంలో

Published : 26 May 2022 01:16 IST

అమరావతి: కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు విషయంలో ప్రతిపక్షాల తీరును రాష్ట్ర మంత్రి రోజా తప్పుబట్టారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టే విషయంలో ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని గతంలో ప్రతిపక్షాలు నిరాహార దీక్షలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రజలు సైతం అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరినట్లు చెప్పారు. అందరూ కోరిన మేరకే సీఎం జగన్‌ కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే అంబేడ్కర్‌ పేరు పెడతానని తెదేపా అధినేత చంద్రబాబు గతంలో అన్నారని రోజా వెల్లడించారు. ఇప్పుడు పేరు పెట్టిన తర్వాత తాను ఒక రకంగా మాట్లాడుతూ.. కింది స్థాయి కేడర్‌తో మరో మాట మాట్లాడిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లర్లు చేయడం సరైన విధానం కాదని.. విధ్వంసాలు సృష్టిస్తే మాత్రం సహించేది లేదని రోజా హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు