ఏపీ అన్యాయం చేస్తే ఊరుకోం: శ్రీనివాస్‌గౌడ్‌

తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నారని, అలాగని ఏపీ తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

Updated : 22 Jun 2021 11:35 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలు బాగుండాలని సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నారని, అలాగని ఏపీ తమకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. తాము మంచిని కోరుకుంటున్నప్పటికీ ఏపీ పాలకులు మాత్రం గొడవకు సిద్ధమవుతున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కృష్ణా జలాలను నెల్లూరు జిల్లాకు తరలించాలని ఏపీ పాలకులు చూస్తున్నారని శ్రీనివాస్‌ గౌడ్‌ ఆరోపించారు. ‘నదీ పరివాహకం లేని జిల్లాలకు కృష్ణా జలాలు కావాలా? నది పక్కనున్న పాలమూరుకు వద్దా?’అని ఆయన ప్రశ్నించారు. ట్రైబ్యునల్‌, ఎన్‌జీటీ ఆదేశాలనూ ఏపీ ప్రభుత్వం ధిక్కరిస్తోందని, టెలిమెట్రీలు ధ్వంసం చేసి ఏపీ అక్రమంగా నీరు తీసుకుంటోందని శ్రీనివాస్‌ వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని