Vasamsetti Subhash: వైకాపా ప్రభుత్వ విధానాలతో 40 లక్షల మందికి ఉపాధి కరవు: ఏపీ మంత్రి సుభాష్‌

గత వైకాపా ప్రభుత్వం విధానాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆరోపించారు.

Updated : 23 Jun 2024 14:48 IST

కాకినాడ నగరం: గత వైకాపా ప్రభుత్వం విధానాల కారణంగా రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధిని కోల్పోయారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ ఆరోపించారు. ఇసుక అందుబాటులో లేకపోవడమే దీనికి కారణమన్నారు. కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇసుక అందుబాటులోకి తెచ్చి కార్మికులకు జీవనోపాధిని కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. చంద్రన్న బీమా సాయాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు తెలిపారు. దీనివల్ల ప్రమాదాలకు గురయ్యే కార్మికుల కుటుంబాలకు చేయూత లభిస్తుందన్నారు. అనంతరం జీజీహెచ్‌లో డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆయన వెంట నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని