మేం నామినేటెడ్‌ వ్యక్తులం కాదు.. గవర్నర్ అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారు: తలసాని

గవర్నర్‌ తమిళిసై ప్రెస్‌మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తమను ఎన్నుకున్నారని..

Updated : 20 Apr 2022 12:30 IST

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై ప్రెస్‌మీట్లు పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే తమను ఎన్నుకున్నారని.. తాము నామినేటెడ్‌ వ్యక్తులం కాదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రితో పనిచేయడం ఇష్టంలేదని చెప్పడం గవర్నర్‌ విజ్ఞతకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానించారు. గవర్నర్‌గా ఆమె బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని తలసాని హితవు పలికారు. 

‘‘రాజ్యాంగపరంగా కొన్ని పరిమితులు ఉంటాయి. వాటికి లోబడే పనిచేయాలి. కానీ గవర్నర్‌ మీడియాతో అత్యుత్సాహంతో మాట్లాడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. గవర్నర్‌ తన బాధ్యతను వదిలిపెట్టి రాజకీయపార్టీ నాయకురాలిగా మాట్లాడటం బాధాకరం. మహిళగా ఆమెను ఎంత గౌరవించాలో అంత గౌరవించారు. కానీ అనవసర గిల్లికజ్జాలు పెట్టుకోవడం సరికాదు’’ అని తలసాని వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని