Talasani: అంత భయపడితే హైదరాబాద్‌లో ఎందుకుంటాం?: తలసాని

ఐటీ, ఈడీ దాడులకు భయపడబోమని.. తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు.

Updated : 22 Nov 2022 14:46 IST

హైదరాబాద్‌: ఐటీ, ఈడీ దాడులకు భయపడబోమని.. తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఏదైనా రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప.. టార్గెట్‌ చేసి దాడులకు పాల్పడటం సరికాదని చెప్పారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీశాఖ సోదాలపై ఆయన స్పందించారు.

‘‘ఐటీ, ఈడీ దాడులు సాధారణంగా జరిగితే మేం తప్పించుకోం.. కానీ లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈ దాడులు ముందే ఊహించాం.. సీఎం ముందే చెప్పారు. ఈరోజు వ్యవస్థలు మీ చేతిలో ఉండొచ్చు.. రేపు మా చేతిలో ఉండొచ్చు. దాడులకు తెరాస నాయకత్వం భయపడదు. అంత భయపడితే హైదరాబాద్‌లో ఎందుకుంటాం? దాడుల అంశాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకెళ్తాం. భాజపా ఇలా ఎందుకు చేస్తోందనే విషయంపై ప్రజల్ని చైతన్య పరుస్తాం. వ్యవస్థలు తమ చేతిలో ఉన్నాయని భాజపా ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదు. ఏం జరుగుతుందో భవిష్యత్తులో చూస్తారు’’ అని తలసాని వ్యాఖ్యానించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని