Munugode Bypoll: రాజగోపాల్‌రెడ్డి మూడున్నరేళ్లు గ్రామాలవైపు చూడలేదు: తలసాని

మునుగోడు నియోజకవర్గలో ప్రజా సమస్యల పరిష్కారం తెరాసతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ, ముదిరాజ్‌కాలనీలో ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు.

Updated : 24 Oct 2022 13:52 IST

నాంపల్లి: మునుగోడు నియోజకవర్గలో ప్రజా సమస్యల పరిష్కారం తెరాసతోనే సాధ్యమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని ఉప్పరిగూడ, ముదిరాజ్‌కాలనీలో ఆయన ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ కాంగ్రెస్‌, భాజపాలపై విమర్శలు చేశారు.

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని మునుగోడు ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మూడున్నరేళ్లు గ్రామాల వైపు ఆయన చూడలేదని తలసాని ఆరోపించారు. సబ్బండ వర్గాల అభివృద్ధికి అనేక కార్యక్రమాలను తెరాస ప్రభుత్వం చేపడుతోందన్నారు. భాజపా నేతల మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దని చెప్పారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలతో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కులవృత్తులకు  కేసీఆర్‌ ప్రభుత్వం చేయూత అందిస్తోందని చెప్పారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం తెరాస అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని తలసాని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని