Talasani: మల్లారెడ్డి కాన్వాయ్‌పై దాడిలో ఎవరినీ ఉపేక్షించం: తలసాని

మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై నిన్న జరిగిన దాడిని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు మంచిది కాదని హితవు పలికారు.

Updated : 30 May 2022 18:10 IST

హైదరాబాద్‌: మంత్రి మల్లారెడ్డి కాన్వాయ్‌పై నిన్న జరిగిన దాడిని మరో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా దాడులు మంచిది కాదని హితవు పలికారు. నగరంలోని మాసబ్ ట్యాంక్‌ వద్ద ఉన్న తన కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. నిన్న మేడ్చల్ నియోజకవర్గంలో జరిగిన రెడ్ల సింహగర్జన సభకు అనుమతులు ఇప్పించి సహకరించిన మల్లారెడ్డిపైనే దాడి చేయడమేంటని ప్రశ్నించారు. వేదికపై మంత్రి అన్ని విషయాలు చెప్పారని తెలిపారు.

‘‘సభకు వచ్చిన కొందరు రెడ్డి కార్పొరేషన్ కావాలని అడిగారు. సభలో ఆ ఒక్క విషయమే చెప్పాలా? రెడ్డి కార్పొరేషన్‌ గురించే మాట్లాడాలని అనడం సబబుకాదు. ఓ బాధ్యత గల మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సమ న్యాయం చేస్తుందని చెప్పుకొచ్చారు. ఎనిమిదేళ్లుగా ప్రభుత్వం చేసిన అంశాలను వివరించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నా చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. ఈ ఘటనలో ఎవరినీ ఉపేక్షించం’’ అని తలసాని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని