Mithun Chakraborty: టీఎంసీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారు.. భాజపా నేత వ్యాఖ్యలు..!

తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌ ఉన్నారంటూ భాజపా నేత మిథున్‌ చక్రవర్తి వ్యాఖ్యలు చేశారు.

Published : 25 Sep 2022 01:26 IST

కోల్‌కతా: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌ ఉన్నారంటూ భాజపా నేత మిథున్‌ చక్రవర్తి వ్యాఖ్యలు చేశారు. ‘21 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ నాకు టచ్‌లో ఉన్నారు. ఈ విషయం నేను ఇంతకుముందే చెప్పాను. మళ్లీ చెప్తున్నాను. నేను చెప్పినదానికి కట్టుబడి ఉన్నాను. అయితే కచ్చితమైన సంఖ్య మాత్రం నేను చెప్పలేను. 21 కంటే తక్కువైతే కాదు. సమయం కోసం వేచి చూడండి’ అంటూ శనివారం కోల్‌కతాలోని భాజపా కార్యాలయంలో మాట్లాడారు. ఇది వరకు కూడా ఆయన ఈ తరహాలో స్పందించారు. 

దుర్గా పూజకు ముందు కోల్‌కతాలో మిథున్ చక్రవర్తి భాజపా నేతలతో సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, అయితే దీని వెనక ప్రధాని మోదీ ఉన్నారని నేను అనుకోవడం లేదని ఇటీవల బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. దానిపై మిథున్ స్పందించారు. ‘ఆమె చెప్పింది సరైందే కావొచ్చు. ప్రధాని ఇవన్నీ చేయడం లేదు. కోర్టు ఆదేశాలు ఇస్తే.. మనం మాత్రం ఏం చేయగలం. మీరు ఏ తప్పు చేయకపోతే, ఇంటికి వెళ్లి ప్రశాంతంగా నిద్రపోండి. కానీ చిన్న ఆధారం దొరికినా.. రాష్ట్రపతి, ప్రధాని కూడా మిమ్మల్ని కాపాడలేరు’ అని మమత విమర్శలకు సమాధానం ఇచ్చారు. 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని