Balakrishna: ‘యువగళం’ వైకాపా నేతల్లో వణుకు పుట్టిస్తోంది: నందమూరి బాలకృష్ణ

లోకేశ్‌ చేయనున్న యువగళం పాదయాత్ర వైకాపా నాయకుల్లో భయం కలిగిస్తోందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. సీఎం జగన్‌కి ఇసుక, వైన్‌, మైన్‌ తప్ప ప్రజల ఇబ్బందులు పట్టడం లేదని విమర్శించారు.

Published : 26 Jan 2023 20:40 IST

హిందూపురం: ఒక్క ఛాన్స్‌  అంటూ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్‌కి ఇసుక, వైన్‌, మైన్‌ తప్ప ప్రజల ఇబ్బందులు పట్టడం లేదని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో నిర్వహించిన ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లోకేశ్‌ చేయనున్న యువగళం పాదయాత్ర వైకాపా నాయకుల్లో భయం కలిగిస్తోందన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత యువగళంతో బయటపడుతుందని వైకాపా భయపడుతోందని బాలకృష్ణ అన్నారు. వైకాపా బెదిరింపులకు భయపడేవారు ఎవరూ లేరని హెచ్చరించారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదని, ఉపాధి.. ఉద్యోగ అవకాశాలు లేక యువత ఆందోళన చెందుతున్నారన్నారు. ఉపాధి లేక రాయలసీమ జిల్లాల నుంచి ప్రజలు వలసపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ ఈ ప్రాంతంపై దృష్టి పెట్టడం వల్లే ఇన్ని విద్యా సంస్థలు ఇవాళ విద్యను అందిస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు.

బాలకృష్ణకు తప్పిన ప్రమాదం..

తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన  ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తర్వాత బాలకృష్ణ వాహనం దిగుతుండగా పక్కకు తూలారు. అక్కడ ఉన్నవారు వెంటనే అప్రమత్తమై పట్టుకోవడంతో బాలయ్యకు ప్రమాదం తప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని