TS News: వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 08 Nov 2021 17:09 IST

మహబూబ్‌నగర్‌: నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట శాసనసభ్యుడు గువ్వల బాలరాజు మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. పోలీసులతో అమర్యాదగా మాట్లాడటం సరి కాదని, అందువల్ల గొప్పతనం పెరిగిపోదంటూ ఓ పోలీస్ అధికారి గువ్వలకు సూచించారు. పోలీసులతో గువ్వల బాలరాజు అమర్యాదగా మాట్లాడటంతో అక్కడున్న వారు అలా స్పందించినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌లోని బూత్‌పూర్ రోడ్డులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ దశదిన కర్మకు గువ్వల బాలరాజు హాజరైన సందర్భంలో ఈ వాగ్వాదం చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. వీడియోలో ఎమ్మెల్యే తీరు చర్చనీయాంశంగా మారింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని