Jagga Reddy: ఏపీని మూడు రాష్ట్రాలు చేస్తే.. ఆ ముగ్గురూ సీఎంలు కావొచ్చు: జగ్గారెడ్డి

ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానులకంటే 3 రాష్ట్రాలు చేస్తే మేలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ..

Updated : 27 Sep 2022 14:26 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో 3 రాజధానుల కంటే 3 రాష్ట్రాలు చేస్తే మేలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. అలా చేస్తే సీఎం పదవి కోసం జగన్‌ కుటుంబంలో ఉన్న గొడవ తీరుతుందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 

‘‘కుటుంబ పంచాయితీని జగన్‌, షర్మిల తెలంగాణకు వచ్చి పెట్టడం సరికాదు. నేను మంత్రి కేటీఆర్‌ కోవర్ట్‌ అని షర్మిల అనడం దురదృష్టకరం. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ గులాంగిరీ చేస్తున్నారు. ఏపీలో మూడు రాజధానుల గొడవ నడుస్తోంది. అక్కడ మూడు రాజధానుల కంటే మూడు రాష్ట్రాలు చేసుకుంటే ముగ్గురు ముఖ్యమంత్రులవుతారు. అప్పుడు జగన్‌, షర్మిల, విజయసాయిరెడ్డి సీఎంలు అవుతారు. షర్మిల తన కుటుంబ పంచాయితీ అక్కడే పెట్టుకోవాలి. అవసరమైతే మోదీతో మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవాలి. నేను కేటీఆర్‌ కోవర్ట్‌ అని మా పార్టీ వాళ్లూ బద్నాం చేస్తున్నారు.  షర్మిల నా జోలికి రాకుంటే నేను ఆమె జోలికి వెళ్లను.

ఆరోగ్యశ్రీ సరిగా అమలు కావడం లేదు

గతంలో ఆరోగ్యశ్రీ పథకంతో పేదలకు మంచి వైద్యసేవలు అందేవి. ఇప్పుడు ఆ పథకం సరిగా అమలు కావడం లేదు. క్యాన్సర్‌ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగారం, ఆస్తులన్నీ అమ్ముకుని వైద్యం చేయించుకోవాల్సి వస్తోంది. ఆరోగ్యశ్రీ పట్ల సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఈ పథకం బాగా అమలైంది. ఎవరైనా వైద్యం చేయించుకుంటే సీఎం సహాయనిధి నుంచి రూ.10లక్షలకు కేవలం రూ.30వేలు మాత్రమే వస్తోంది. ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావును కోరుతున్నా’’ అని జగ్గారెడ్డి చెప్పారు. 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts