Jaggareddy: షర్మిల భాజపా వదిలిన బాణం.. ఎవరికి తగులుతుందో?: జగ్గారెడ్డి

ఎమ్మెల్సీ కవిత, బీఎల్‌ సంతోష్‌లను అరెస్టు చేయాలని అజెండాగా తీసుకోనున్నట్టు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైతెపా అధ్యక్షురాలు షర్మిల హద్దులు దాటి మాట్లాడుతున్నారన్నారు.

Updated : 02 Dec 2022 21:08 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత, బీఎల్‌ సంతోష్‌లను అరెస్టు చేయాలనేదే తమ అజెండాగా తీసుకోనున్నట్టు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైతెపా అధ్యక్షురాలు షర్మిల హద్దులు దాటి మాట్లాడుతున్నారన్నారు. ఆమె మహిళ కాకుంటే తమ స్పందన వేరుగా ఉండేదని వ్యాఖ్యానించారు. తాము కూడా లోతైన విమర్శలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. షర్మిల భాజపా వదిలి బాణం..  ఎవరికి తగులుతుందో తెలియదన్నారు. 

భాజపా ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థలను రంగంలోకి దించగా.. తెరాస ప్రభుత్వం ఏసీబీ, పోలీసు విభాగాలను వాడుకుంటోందని ఆరోపించారు. అరెస్టు చేసుకుంటే చేసుకోండని అంటున్నా.. ఎమ్మెల్సీ కవిత భయపడుతోందని విమర్శించారు. కవిత దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఉందని, ఆమెను అరెస్టు చేస్తామని భాజపా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోందన్నారు. మోదీ, అమిత్‌ షాలు తెర వెనుక ఉండి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని నడిపించారని ఆరోపించారు. బీఎల్‌ సంతోష్‌ను కాపాడేందుకు భాజపా ప్రయత్నిస్తోందని, ఆయన అరెస్టయితే చాలా విషయాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. లిక్కర్‌ స్కామ్‌ కంటే బీఎల్‌ సంతోష్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం అతిపెద్ద కుంభకోణమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ నేతలను కూడా ట్రాప్‌ చేయాలని భాజపా చూస్తోందన్నారు. త్వరలోనే కాంగ్రెస్‌ నాయకులంతా సమావేశమై ఆ ఇద్దరినీ అరెస్టు చేయాలని పోరాటం చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని