Published : 27 Jun 2022 17:49 IST

Andhra News: సీఎంను కలిసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి

అమరావతి: ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపొందిన మేకపాటి విక్రమ్‌ రెడ్డి ఈరోజు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన విక్రమ్‌.. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు అభినందనలు తెలిపారు. విక్రమ్‌ రెడ్డి వెంట మంత్రులు కాకాని గోవర్దన్‌ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు ఉన్నారు. అనంతరం విక్రమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై సీఎంతో చర్చించానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ముందు ఉంచినట్టు తెలిపారు. తన సోదరుడు దివంగత మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగిస్తానన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని