Telangana News: కేసీఆర్ దర్శకత్వంలోనే ‘ఫామ్‌హౌస్‌ లీలలు, నగదు’ సినిమా: రఘునందన్‌

ఫామ్‌హౌస్ ఘటనలో రూ.100 కోట్ల ఎక్కడివో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. ఫామ్‌హౌస్‌ లీలలు, నగదు అనే సినిమాకు సీఎం కేసీఆర్‌ దర్శకత్వం వహించారని ఎద్దేవా చేశారు.

Published : 29 Oct 2022 01:36 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు ప్రయత్నించిన ఫామ్‌హౌస్ ఘటనలో రూ.100 కోట్ల ఎక్కడివో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌ రావు అన్నారు. ముందు రూ.100 కోట్లని.. ఆ తర్వాత రూ.15 కోట్లన్నారని అంతా నగదు ఎక్కడుందో సైబరాబాద్‌ పోలీసులు, అధికార పార్టీ నేతలు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఫామ్‌హౌస్‌ లీలలు, నగదు అనే సినిమాకు సీఎం కేసీఆర్‌ దర్శకత్వం వహించారని ఎద్దేవా చేశారు. పార్టీ మారేందుకు ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల చరవాణులు పోలీసులు సీజ్‌ చేసినట్లు చెప్పారని.. ఆ చరవాణులు ఎక్కడున్నాయని రఘునందన్‌ ప్రశ్నించారు. 

ఫామ్‌హౌస్‌కు నగదు తీసుకుని వచ్చిన ముగ్గురు వ్యక్తుల డబ్బు ఎక్కడికి పోయిందని రఘునందన్‌ నిలదీశారు. తెరాస ఎమ్మెల్యే ఫిర్యాదులో రూ.100 కోట్లు అని పేర్కొన్నారని.. అంతా సోమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కూడా విచారించాలని రఘునందన్‌రావు ఈడీకి ఫిర్యాదు చేశారు. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వచ్చిన ఆయన అధికారులను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తన వాంగ్మూలాన్ని ఈడీ నమోదు చేసిందని చెప్పారు. తన ఫిర్యాదు ఆధారంగా పూర్తి వ్యవహారంపై ఈడీ దర్యాప్తు చేస్తుందని రఘునందన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని