Raghurama Krishna Raju: కేటీఆర్, జగన్‌.. ఓటమిలోనూ మిత్రులే

జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు ఓడిపోయారో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అర్థం కాకపోయినా, ఓడించిన ప్రజలకు తెలుసని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 11 Jul 2024 04:38 IST

ఎమ్మెల్యే రఘురామ ఎద్దేవా

ఈనాడు డిజిటల్‌- భీమవరం, న్యూస్‌టుడే- కాళ్ల: జగన్‌మోహన్‌రెడ్డి ఎందుకు ఓడిపోయారో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అర్థం కాకపోయినా, ఓడించిన ప్రజలకు తెలుసని ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. ఇద్దరూ ఓడిపోయి మిత్రధర్మాన్ని పాటించారని ఎద్దేవా చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణలో మీరు (కేటీఆర్‌) ఓడిపోతే జగన్‌ కనీసం పట్టించుకోలేదు. మీరు మాత్రం ఆయన్ను ఓదారుస్తున్నారు. వైకాపా పరాజయం కంటే ముందు తెలంగాణలో భారాసకు ఎదురైన పరాజయం గురించి ఆలోచించుకోవాలి. ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ సోషల్‌ మీడియా ఖాతాను కేటీఆర్‌ బ్లాక్‌ చేసినంత మాత్రాన ఆయనకు నష్టమేం లేదు’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని