Raja singh: నేను బతికితే ఏంటి? చస్తే ఏంటి? అని భావిస్తున్నారు: రాజాసింగ్‌

బుల్లెట్‌ ప్రూఫ్ వాహనంలో తిరగకపోతే నోటీసులు ఇస్తున్నారు.. తిరిగితే ఆ వాహనం ఎక్కడ ఆగిపోతుందో అర్థం కావట్లేదని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Published : 27 Jan 2023 01:22 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Rajasingh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్‌ బతికితే ఏంటి? చస్తే ఎంటి? అనే భావనలో కేసీఆర్‌ ఉన్నారని మండిపడ్డారు. ప్రాణహాని లేని ఎమ్మెల్యేలకు కొత్త బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాలు ఇచ్చారని విమర్శించారు. మొరాయిస్తున్న బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం వద్దని అధికారులకు గతంలోనే లేఖ రాశానని, అయినా అదే వాహనాన్ని బాగు చేసి తిరిగి పంపించారని ఆరోపించారు. ప్రాణహాని ఉంది కాబట్టి బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం ఇచ్చామని అధికారులు చెబుతున్నారన్నారు. బుల్లెట్‌ ప్రూఫ్ వాహనంలో తిరగకపోతే నోటీసులు ఇస్తున్నారని, తిరిగితే ఆ వాహనం ఎక్కడ ఆగిపోతుందో అర్థం కావట్లేదని రాజాసింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు