Mla Rajasingh: నాకొద్దీ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనం.. సీఎం, హోం మంత్రిపై రాజాసింగ్‌ ఆగ్రహం

తనకు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం  పాడవుతుందని ఎన్నిసార్లు చెప్పినా తిరిగి అదే బండి కేటాయిస్తున్నారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Rajasingh) మండిపడ్డారు.

Updated : 09 Feb 2023 20:29 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌, హోం మంత్రి మహమూద్‌ అలీపై గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ (Rajasingh) ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన బుల్లెట్‌ ప్రూఫ్ వాహనం  పాడవుతుందని ఎన్నిసార్లు చెప్పినా తిరిగి అదే బండి కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఇవాళ అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుంటే వాహనం ముందు చక్రం ఊడిపోయిందన్నారు. బండి వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తనకు ఇచ్చిన వాహనాన్ని మార్చాలని లేదంటే మీ వాహనం మీరు తీసుకోండి అంటూ పరుషపదజాలంతో వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని