
Updated : 19 Jan 2021 04:11 IST
ప్రోటోకాల్ పాటించడం లేదు: ఎమ్మెల్యే రోజా
సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు
తిరుపతి: తిరుపతిలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని నగరి ఎమ్మెల్యే రోజా ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి పద్మావతి అతిథిగృహంలో జరిగిన శాసనసభా హక్కుల కమిటీ సమావేశంలో ఆమె గోడు వెల్లబోసుకున్నారు. రోజా లేవనెత్తిన కొన్ని అంశాలు కమిటీ పరిధిలోకి రావని.. వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని శాసనసభా హక్కుల కమిటీ ఛైర్మన్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. నిబంధనలను పాటించడంలో కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నాయని రోజా చెప్పారని.. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అలాంటి సమస్యలను సరిచేసి భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారని కాకాణి తెలిపారు.
ఇదీ చదవండి..
Tags :