
Published : 25 Jan 2021 01:02 IST
నిమ్మగడ్డ కావాలనే వ్యతిరేకిస్తున్నారు: రోజా
తిరుమల: దేశంలో ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్‌ఈసీ విభేదించిన సందర్భాలు లేవని.. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ కావాలనే వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడారు. ఎస్‌ఈసీ వెనుక ఎవరున్నారో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాయిదా వేయాలని కోరామే తప్ప.. ఎన్నికలకు భయపడికాదన్నారు. ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారని ఆమె ప్రశ్నించారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నికలను వాయిదా వేస్తుందనే విశ్వాసంతో ఉన్నట్లు రోజా తెలిపారు.
ఇవీ చదవండి..
Tags :