Andhra News: అలాంటివి ఏపీలో తప్ప మరెక్కడా జరగవు: అశోక్‌బాబు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. రూ.800 కోట్లు ఉద్యోగుల సొమ్ము ఎవరు వాడుకున్నారనే

Published : 29 Jun 2022 13:30 IST

అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఆరోపించారు. రూ.800 కోట్లు ఉద్యోగుల సొమ్ము ఎవరు వాడుకున్నారనే విషయంలో స్పష్టత లేకుండా పోయిందన్నారు. ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయమైతే ఉద్యోగ సంఘాల నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకపోగా వారు దాచుకున్న సొమ్ములు కూడా మాయం కావడం ఏపీలో తప్ప మరెక్కడా జరగదని దుయ్యబట్టారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని