Teenmar Mallanna: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీన్మార్‌ మల్లన్న విజయం

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం సాధించారు. 

Published : 07 Jun 2024 22:33 IST

నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాన్ని ఆర్వో దాసరి హరిచందన అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. భారాస అభ్యర్థి రాకేశ్‌రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. సాంకేతికంగా ఓడిపోవచ్చు..కానీ, నైతక విజయం తనదేనన్నారు. జూన్‌ 5న ఉదయం 8గంటలకు ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ శుక్రవారం రాత్రి 10.30 గంటల వరకు కొనసాగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని