ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిపివేత

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తలెత్తిన గందరగోళంతో సిబ్బంది కౌంటింగ్‌ నిలి

Updated : 19 Mar 2021 18:09 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తలెత్తిన గందరగోళంతో సిబ్బంది కౌంటింగ్‌ నిలిపివేశారు. 8 మంది అభ్యర్థుల ఎలిమినేషన్‌లో 50 ఓట్లు గల్లంతైనట్లు సిబ్బంది తెలిపారు. ఓట్ల గల్లంతుపై భాజపా-కాంగ్రెస్‌ ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్వోకు ఫిర్యాదు చేశారు. అక్కడికి కాసేపటి తర్వాత ఆర్వో ఆదేశాలతో ఓట్ల లెక్కింపు మళ్లీ ప్రారంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని