కార్యకర్తల మనోభావాలు పట్టించుకోలేదు.. అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తా: జీవన్‌ రెడ్డి

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ భారాసను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ఆయనతో భేటీ అయ్యారు.

Updated : 24 Jun 2024 22:52 IST

హైదరాబాద్‌: జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌ భారాసను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్‌బాబు ఆయనతో భేటీ అయ్యారు. చర్చలు ముగిసిన అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ..  పార్టీ నియమ నిబంధనల్ని పాటిస్తానన్నారు. సంజయ్‌ కుమార్‌ చేరిక పట్ల మనస్తాపానికి గురైన విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఆయన చేరికపై కార్యకర్తల మనోభావాలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

జీవన్‌ రెడ్డి.. పార్టీకి పెద్ద దిక్కు: శ్రీధర్‌ బాబు

ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ.. ‘‘నిన్న జరిగిన ఘటనతో జీవన్‌ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని తెలియగానే మేమంతా ఇక్కడకు వచ్చి ఆయనతో చర్చలు జరిపాం. ఆయన అసంతృప్తిని పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్‌ రెడ్డి, పార్టీ వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్‌ మున్షీ, కేసీ వేణుగోపాల్‌ దృష్టికి తీసుకెళ్తాం. జగిత్యాల పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు. 40 ఏళ్లుగా ఆయన పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టేందుకు ఎంతగానో కృషిచేశారు. జీవన్‌రెడ్డి చాలా సీనియర్‌ నేత.. ఆయనకు హామీ ఇచ్చే స్థాయిలో మేం లేము’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు