MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మోదీపై విమర్శలు గుప్పించారు.

Updated : 08 Feb 2023 19:49 IST

హైదరాబాద్‌: పార్లమెంటులో ప్రధాని మోదీ (PM Modi) తన ప్రసంగంలో ‘అదానీ’ (Adani) అంశంపై జవాబు చెప్పలేదని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC kavitha) అన్నారు. జాతీయవాదం ముసుగులో ప్రధాని దాక్కుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘రైతులకు ప్రభుత్వం అందించే సాయంపై పార్లమెంటులోనే ప్రధాని మోదీ అబద్ధాలు చెప్పారు. 11కోట్ల మంది రైతులకు నగదు సాయం చేస్తున్నామన్నారు. కానీ, కేంద్రం 3.87 కోట్ల మంది రైతులకే సాయం అందిస్తోంది. ఏటా నగదు సాయం లబ్ధి పొందే రైతుల సంఖ్య తగ్గిస్తున్నారు’’ అని కవిత ఆరోపించారు. అదానీ సంస్థల్లో ప్రజల సంస్థ ఎల్‌ఐసీ పెట్టుబడులు పెట్టిందన్న కవిత.. అదానీ వ్యవహారంపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) వేయాలని భారాస డిమాండ్‌ చేస్తోందని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని