MLC Kavitha: దిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు.. మధ్యాహ్నం కవిత ప్రెస్ మీట్

భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.

Published : 09 Mar 2023 09:24 IST

దిల్లీ: భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) గురువారం మధ్యాహ్నం ఒంటిగంటకు దిల్లీలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. దిల్లీ మద్యం కేసు(Delhi liquor case)లో ఈడీ నోటీసులు, విచారణపై ఆమె స్పందించే అవకాశముంది. ఈ కేసులో నేడు విచారణకు రావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) కవితకు బుధవారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 9, 10 తేదీల్లో ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా విచారణకు రాలేనని.. 11న హాజరవుతానని బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు 10న దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారత్‌ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమంలో కవిత పాల్గొననున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకు రావాలనే డిమాండ్‌తో ఆందోళన చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో దిల్లీ మద్యం కేసులో ఈడీ నోటీసులు, భారత్‌ జాగృతి నిరసన కార్యక్రమాలపై కవిత స్పందించనున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు