Kalvakuntla Kavitha: కాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ప్రెస్‌మీట్‌

దిల్లీ మద్యం కేసు రిమాండ్‌ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే.

Updated : 01 Dec 2022 08:35 IST

హైదరాబాద్‌: దిల్లీ మద్యం కేసు రిమాండ్‌ రిపోర్టులో తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా మరికొంత మంది పేర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత స్పందించనున్నారు. కాసేపట్లో బంజారాహిల్స్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు. రిమాండ్‌ రిపోర్టులో ఈడీ పేర్కొన్న అంశాలు.. దానికి సంబంధించిన పరిణామాలపై ఆమె మాట్లాడనున్నారు. కవిత ప్రెస్‌మీట్‌ నేపథ్యంలో తెరాస కార్యకర్తలు ఆమె ఇంటికి చేరుకుంటున్నారు.

మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను అమిత్‌ అరోడా రిమాండ్‌ రిపోర్ట్‌లో ఈడీ పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. బుధవారం దిల్లీ కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్‌ రిపోర్టు సమర్పించింది. ఆ నివేదికలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్‌రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్‌, సృజన్‌రెడ్డి పేర్లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని