MLC Kavitha: దిల్లీకి ఎమ్మెల్సీ కవిత.. రేపటి విచారణపై ఉత్కంఠ!

భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు.

Updated : 19 Mar 2023 17:42 IST

హైదరాబాద్‌: భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) దిల్లీకి బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీ వెళ్లారు. ఆమెతో పాటు మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌ కూడా ఉన్నారు. దిల్లీ మద్యం కేసులో (Delhi Liqour Scam) ఈనెల 20న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విచారణకు హాజరవుతారా? లేక గతంలో మాదిరిగా తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. 

విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జారీ చేయడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఒక మహిళను విచారించేందుకు ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. తమకు ఇచ్చిన నోటీసుల్లో ఇతరులతో కలిపి విచారిస్తామని చెప్పారని.. కానీ అలా చేయలేదని కవిత పేర్కొన్నారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సీజేఐ ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు, తక్షణమే విచారించేందుకు నిరాకరించింది. ఈనెల 24న వాదనలు వింటామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండటంతో ఈనెల 16న ఈడీ విచారణకు కవిత హాజరు కాలేదు. దీంతో సుప్రీం తీర్పునకు ముందే మరోసారి వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని