Published : 12/03/2021 01:15 IST

విశాఖ ఉక్కుపై ఎమ్మెల్సీ మాధవ్‌ కీలక వ్యాఖ్యలు

విశాఖ: విశాఖ ఉక్కుపై ఏపీ భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్‌ మాధవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న 35 ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలనే ఉద్దేశం కేంద్రానిదని.. ఆ క్రమంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిర్ణయించిందన్నారు. ఆచరణలో అనేక మార్పులకు అవకాశముందని చెప్పారు. మార్పులకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. 

ఉపాధి కల్పన, ఉత్పత్తి పెంపు, సౌకర్యాల కల్పనకు కేంద్రం ప్రణాళిక రచిస్తోందని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ఎలా చేయాలనే దానికి ఇంకా సమయం ఉందని.. ఆలోపు ఏ మార్పులైనా జరగొచ్చని మాధవ్‌ వ్యాఖ్యానించారు. అందరి ఆమోదంతోనే ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ జరుగుతుందని చెప్పారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని