
ఆధిక్యంలో కొనసాగుతున్న పల్లా, వాణీదేవి
నల్గొండ, హైదరాబాద్: నల్గొండ - వరంగల్ - ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెరాస ముందంజలో ఉంది. శుక్రవారం ఉదయం వరకు నల్గొండ స్థానంలో ఏడు, హైదరాబాద్ స్థానంలో ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ‘నల్గొండ’లో మొత్తం ఏడు రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ముగిసేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్నపై 27,550 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో పల్లాకు 1,10,840 ఓట్లు రాగా, మల్లన్నకు 83,290 ఓట్లు వచ్చాయి. తెజస అధ్యక్షుడు కోదండరాం 70,072 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. భాజపా అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డికి 39,107 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్‌కు 27,588 ఓట్లు పోలయ్యాయి. ఏడు రౌండ్లలో చెల్లని ఓట్లు 21,636 గుర్తించారు. ప్రస్తుతం ద్వితీయ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10 నుంచి 15 ఓట్లు వచ్చిన 10 మంది అభ్యర్థులను ఎలిమినేట్ చేశారు.
బుధవారం సాయంత్రం 6 గంటలకు తొలి రౌండ్ లెక్కింపు ప్రక్రియను ప్రారంభించగా, శుక్రవారం ఉదయానికి ఏడు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. మొదటి ప్రాధాన్య ఓటులో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు చేపట్టారు. దీంతో తుది ఫలితాలు శనివారం వచ్చే అవకాశం ఉందని అంచనా. మొత్తం 3,85,996 ఓట్లు పోలవగా, ఇప్పటి వరకు 3,35,961 ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ స్థానంలో తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డికి స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న గట్టి పోటీ ఇచ్చారు. కోదండరాం, తీన్మార్ మల్లన్నల మధ్య కూడా తేడా స్వల్పంగానే ఉండటంతో గెలుపు ఎవరిదనే అంశంపై చర్చ సాగుతోంది.
భాజపా, తెరాస మధ్య ఉత్కంఠ పోరు
హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ‘హైదరాబాద్’ స్థానంలో పూర్తయిన ఆరు రౌండ్లలో తెరాస, భాజపా మధ్య పోటీ ఉత్కంఠ పోరు సాగుతోంది. ఆరో రౌండ్ ముగిసే సరికి తెరాస అభ్యర్థి వాణీదేవి 7,626 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు. మొత్తం ఆరు రౌండ్లలో సురభి వాణీదేవికి 1,05,710 ఓట్లు, భాజపా అభ్యర్థి రామచందర్‌రావుకు 98,084, స్వతంత్ర అభ్యర్థి ప్రొ.నాగేశ్వర్‌కు 50,450, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, తెదేపా అభ్యర్థి ఎల్.రమణకు 5,606 ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజారిటీ ఎవరికీ వచ్చే అవకాశం లేదని అధికారులంటున్నారు. రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పనిసరి అని, మూడో ప్రాధాన్య ఓట్లని కూడా లెక్కించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. దీంతో శనివారం రాత్రికి తుది ఫలితాలు వెలువడవచ్చని అంచనా వేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Sai pallavi: సినీనటి సాయిపల్లవి పిటిషన్‌ను కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు
-
General News
MP Arvind: ఎంపీగా ఉన్న నాపైనే హత్యాయత్నం జరిగింది.. సీపీని తప్పించాలి: అర్వింద్
-
General News
covid cases: తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా.. కొత్తగా 592 కేసులు
-
Movies News
Social Look: క్యాప్షన్ కోరిన హన్సిక.. లావణ్య త్రిపాఠి ఫైర్!
-
Sports News
Ravi Shastri - Parthiv: నిన్ను ఓపెనర్‌గా పంపుతున్నాం.. రబాడను దంచేయ్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Venu: అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా: వేణు తొట్టెంపూడి
- Naga Chaitanya: నువ్వే నాకు ప్రేమించడం నేర్పించావ్.. చై ఎమోషనల్ పోస్ట్
- ప్రసవం తర్వాత.. ఆ భాగం బిగుతుగా మారాలంటే..
- Elon Musk: ఉద్యోగితో మరో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన మస్క్?
- Nagababu: భీమవరం సభలో చిరంజీవి తప్ప మిగిలిన వారి నటన అద్భుతం: నాగబాబు ట్వీట్
- పాఠాలు చెప్పలేదని.. రూ.24లక్షల జీతం తిరిగిచ్చేసిన ప్రొఫెసర్
- ఒకటే గొప్పనుకుంటే.. ఆరు చోట్ల సాధించింది!
- IND vs ENG : ధనాధన్ వేళాయె..
- Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్.. ఆయన గురించి తెలుసా?
- Chandrababu: చంద్రబాబు వేలికి ప్లాటినం ఉంగరం.. దాని వెనక కథేంటి?