Erode East bypoll: ఇళంగోవన్‌కే బేషరతుగా మద్దతు ఇస్తున్నాం: కమల్ హాసన్
ఈరోడ్ (తూర్పు) స్థానంలో ఉప ఎన్నికలో ఎస్పీఏ అభ్యర్థి ఇళంగోవన్‌కు బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ లో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
చెన్నై: తమిళనాడులోని ఈరోడ్ తూర్పు(Erode East) నియోజకవర్గంలో ఫిబ్రవరి 27న ఉప ఎన్నిక(By-poll) జరగనున్న విషయం తెలిసిందే. ఈ స్థానంలో డీఎంకే(DMK) సారథ్యంలోని సెక్యులర్ ప్రోగ్రసివ్ అలయెన్స్(ఎస్పీఏ) అభ్యర్థిగా కాంగ్రెస్(Congress) సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్(EVKS Elangovan) బరిలో నిలిచారు. దీంతే ఆయనకే బేషరతుగా మద్దతు ఇవ్వనున్నట్టు మక్కల్‌నీది మయ్యం(MNM) అధినేత, సినీనటుడు కమల్ హాసన్(Kamal Hassan) ప్రకటించారు. తమ పార్టీ గవర్నింగ్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల సమావేశాల్లో ఎస్పీఏ అభ్యర్థి, తన స్నేహితుడైన ఇళంగోవన్‌కు బేషరతుగా మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. ఇళంగోవన్ తనయుడు తిరుమహన్ ఎవెరా మరణంతో ఈరోడ్ తూర్పు స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ సీటునుంచి ఇళంగోవన్‌ను బరిలో దించాలని ఎస్పీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయనకు బేషరతుగా మద్దతు ప్రకటించిన కమల్ హాసన్‌కు డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం స్టాలిన్ కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కమల్‌ను కలిసిన ఇళంగోవన్ కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
మరోవైపు, కమల్ హాసన్ పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం ఇదే తొలిసారి. 2019 లోక్‌సభ ఎన్నికలు, 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు. అయితే, డీఎంకే మద్దతు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడేందుకే వారితో చేతులు కలిపినట్టు తెలిపారు. ఆ శక్తులు ప్రజలు తినే తిండి సహా వారి జీవితాల్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నాయంటూ విమర్శించారు. ఎన్నికైన ప్రభుత్వాలు సైతం స్వచ్ఛగా పనిచేసే వీలు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. జాతీయ ప్రాముఖతకు సంబంధించిన విషాయలు వచ్చినప్పుడు విభేదాలను చెరిపేసి ఒక్కటి కావాలన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
INDW vs SAW: ముక్కోణపు సిరీస్ ఫైనల్లో భారత్ ఓటమి..
-
Technology News
Coca Cola Phone : కోలా ఫోన్ కాదు.. కోకాకోలా స్పెషల్ ఎడిషన్.. ఫీచర్లివే!
-
Politics News
BJP: భాజపా కీలక నిర్ణయం.. సీఎంపై పోటీకి మాజీ మిలిటెంట్ నేత
-
Sports News
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌ని వీక్షించనున్న ప్రధాని నరేంద్ర మోదీ
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandrababu: వైఎస్ వివేకా హత్య.. జగన్ ఇప్పుడు తప్పించుకోలేరు: చంద్రబాబు