రాష్ట్రాన్ని చీకటి కోణంలో చూపించే యత్నం: విజయన్‌

కేరళ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, భాజపాలు కుట్రపన్నుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. రాష్ట్ర మనుగడను ప్రశ్నార్థకం చేయాలనుకున్నవారే ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు....

Published : 04 Apr 2021 11:56 IST

తిరువనంతపురం: కేరళ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌, భాజపాలు కుట్రపన్నుతున్నాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించారు. రాష్ట్ర మనుగడను ప్రశ్నార్థకం చేయాలనుకున్నవారే ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో సొంత జిల్లా కన్నూరులో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న విజయన్‌ ప్రతిపక్షాలే లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో మత రాజకీయాలు చేసేందుకు ఆరెస్సెస్‌ చేసే ప్రయత్నాలు ఫలించబోవని, ఇక్కడ లౌకికతత్వ పునాదులు బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కేరళను సోమాలియాతో పోల్చారన్న విజయన్‌.. రాష్ట్రాన్ని చీకటి కోణంలో చూపించేందుకే సంఘ్‌ పరివార్‌ ఆసక్తి చూపిస్తోందని ఆరోపించారు. ఏప్రిల్‌ 6న జరిగే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌, భాజపాలకు సరైన సమాధానం ఇస్తారని పినరయి అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని