
PMCares: ‘మోదీ, వెంటిలేటర్స్ రెండూ ఫెయిలే’
దిల్లీ: కరోనా కట్టడి నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి ఆయన ప్రధాని మోదీని వైద్య పరికరమైన వెంటిలేటర్‌తో పోల్చారు. పీఎం కేర్స్ నిధులతో తెచ్చిన వెంటిలేటర్లపై ప్రచారం ఎక్కువగా జరిగిందని.. కానీ, పని చేడయంలో మాత్రం మోదీ వలే అవి కూడా విఫలమయ్యాయని విమర్శించారు. అలాగే అవసరమున్న సమయంలో వెంటిలేటర్లు అందుబాటులో ఉండడం లేదని.. మోదీ సైతం కావాల్సిన సమయంలో కానరావడం లేదన్నారు.
కరోనా కట్టడి విషయంలో రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. మహమ్మారిని కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. అన్ని వ్యూహాలు విఫలమయ్యాయని విమర్శిస్తున్నారు. వ్యాక్సినేషన్ విషయంలోనూ మోదీ ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని ఆరోపిస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.