రైతు శ్రేయస్సుకు కట్టుబడి ఉన్నాం: మోదీ

రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్యవసాయ రంగంలో మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతుల గౌరవాన్ని కాపాడుతూ.........

Updated : 26 Feb 2021 04:29 IST

కోయంబత్తూరు: రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. వ్యవసాయరంగంలో మధ్యవర్తులపై ఆధారపడకుండా రైతుల గౌరవాన్ని కాపాడుతూ వారి శ్రేయస్సుకు పాటుపడుతున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి ఓ రూపు తీసుకురావాలన్నదే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయమని వివరించారు. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు.

చిన్నసన్నకారు రైతుల కోసం పనిచేయడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఏడేళ్లుగా వారి కోసం పనిచేస్తున్నామని చెప్పారు. భూసార పరీక్షల కార్డులు, ఇతర కార్యక్రమాల ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తలపెట్టామన్నారు. డీఎంకే- కాంగ్రెస్‌ నేతలు ఒక్క చోట కూర్చుని రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా? అని ఆలోచన చేస్తున్నారని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం అవినీతితో పరిపాలన అందిస్తే.. ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వం కరుణతో కూడిన పాలన అందిస్తోందని అన్నారు. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-భాజపా ఒక కూటమిగా డీఎంకే- కాంగ్రెస్‌ మనో కూటమిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని