కారు స్పీడ్‌ మీదుంది.. యూపీ ఫలితాలు తెలంగాణలో పునరావృతం కావు: అసదుద్దీన్‌

రాష్ట్రంలో కారు స్పీడ్‌ మీదుందని.. భాజపా అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఫలితం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు

Published : 13 Mar 2022 01:33 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో కారు స్పీడ్‌ మీదుందని.. భాజపా అధిష్ఠానం తెలంగాణపై దృష్టి సారించినా వచ్చే ఎన్నికల్లో పెద్దగా ఫలితం ఉండదని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శాసనసభ ప్రాంగణంలో మంత్రి కేటీఆర్‌ను కలిసిన సందర్భంగా ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణపై అసదుద్దీన్‌ స్పందించారు. మంత్రి కేటీఆర్‌తో భేటీకి రాజకీయ ప్రాధాన్యత ఏమీ లేదన్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ప్రజా తీర్పుపై చర్చించుకున్నట్టు చెప్పారు. ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాలు తననేమీ  ఆశ్చర్యపర్చలేదని, ఎస్పీ అధినేత అఖిలేష్‌ యాదవ్ ఎన్నికలకోసం మరింత ముందు నుంచే సిద్ధమవ్వాల్సిందన్నారు. రాష్టంలో సీఎం కేసీఆర్ బలంగా ఉన్నారని, భాజపా తెలంగాణపై దృష్టి సారించినా యూపీ లాంటి ఫలితాలు పునరావృతం కావని అసద్‌ అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని