GVL: ఎన్టీఆర్‌ పేరు మార్పు.. వైకాపా చేసింది ముమ్మాటికీ దుర్మార్గమే: జీవీఎల్‌

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడంపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది.

Published : 25 Sep 2022 12:14 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడంపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే విపక్ష నేతలతో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని సంఘాల ప్రతినిధులు వైకాపా ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఈ నిర్ణయంపై తాజాగా భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. 

‘‘భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిన ఎన్టీఆర్‌ను వివాదంలోకి లాగుతూ వైకాపా చేసింది ముమ్మాటికీ దుర్మార్గమే. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మరల్చడం కోసమే ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారు. మీ వికృత రాజకీయాల కోసం ఎన్టీఆర్‌ ఆత్మను క్షోభ పెట్టొద్దు’’ అని ట్విటర్‌లో జీవీఎల్ పేర్కొన్నారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని