
సీఎంకు అలాంటి వ్యాఖ్యలు తగునా?
తీరథ్ సింగ్ వ్యాఖ్యలపై జయా బచ్చన్ ఆగ్రహం
దిల్లీ: మహిళల వస్త్రధారణను ఉద్దేశించి ఉత్తరాఖండ్ సీఎం తీరథ్సింగ్ రావత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చిరిగిన జీన్‌ప్యాంట్ వేసుకున్న మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జయా బచ్చన్ స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగినవి కాదన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బహిరంగ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆలోచించి మాట్లాడాలని ఆమె సూచించారు. ఆయన మాటలు చెడు ఆలోచనలను, మహిళలపై నేరాలను ప్రోత్సహించేలా ఉన్నాయని జయ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. మరోవైపు, చిరిగిన జీన్ (రిప్డ్ జీన్) వేసుకున్న ఓ మహిళను ఉద్దేశించి సీఎం కామెంట్స్‌పై సోషల్ మీడియాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ రోజు ట్విటర్లోనూ #RippedJeans అనే పేరుతో హ్యాష్‌టాగ్ ట్రెండిగ్‌గా మారింది.
ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తీరథ్ సింగ్ రావత్ మంగళవారం దేహ్రాదూన్‌లో ఉత్తరాఖండ్ స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఛైల్డ్ రైట్స్ నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓసారి విమానంలో తన పక్కన కూర్చున్న ఓ మహిళ చిరిగిన జీన్ ధరించిందని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ఆమె ఒక ఎన్జీవోని సైతం నడుపుతోందని చెప్పారు. ఇలాంటి మహిళ ప్రజా సమస్యలపై బయటకు వెళ్లి సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుంది? ఇలాంటి వస్త్రధారణ మన పిల్లలకు ఏం సంకేతాలు ఇస్తాయి? మనమేం చేస్తామో పిల్లలూ అదే ఫాలో అవుతారు. ఇంట్లోనే సంస్కృతి మూలాలు నేర్పిస్తే ఎంత ఆధునికంగా ఉన్నా ఫర్వాలేదు. జీవితంలో ఎప్పుడూ వైఫల్యం చెందరు’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
India Corona: మళ్లీ పెరిగిన కొత్త కేసులు.. లక్షకు పైగా కరోనా బాధితులు..!
-
General News
Telangana News: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా!
-
Movies News
Ram: ఇంట్లో వాళ్లని నమ్మించాల్సి వస్తోంది.. రూమర్స్‌పై రామ్ ట్వీట్
-
Business News
Stock Market: లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు
-
Ap-top-news News
Botsa: అందుకే నాకు భయమేస్తోంది: బొత్స
-
Ap-top-news News
Raghurama: రఘురామను హైదరాబాద్‌లోనే విచారించండి: ఏపీ సీఐడీకి హైకోర్టు ఆదేశం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- తెలంగాణ రుచులు... మళ్లీ మళ్లీ యాదికి రావాలె!
- IND vs ENG: కథ మారింది..!
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- 18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- Maharashtra Crisis: సీఎం పదవికి రాజీనామా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (30-06-2022)
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం