మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకోండి: కోమటిరెడ్డి

మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్‌

Published : 26 Mar 2021 01:25 IST

ప్రధాని మోదీకి లేఖ రాసిన కాంగ్రెస్‌ ఎంపీ

హైదరాబాద్‌: మూసీ నది ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. హైదరాబాద్‌ ఖ్యాతికి నిలువుటద్దమైన మూసీ నది.. కాలుష్యం కోరల్లో చిక్కుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాడు నగర వాసులకు తాగు, సాగునీటి అవసరాలకు ఉపయోగపడే ఆ నది నీరు.. నేడు వాడకానికి పనిరాకుండా పోయిందన్నారు. కాలుష్యం బారిన పడిన మూసీని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానికి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. 

మూసీ పరీవాహక ప్రాంతాల్లో 300 నుంచి 500 అడుగుల లోతు వరకు భూగర్భజలం కలుషితమైందని లేఖలో ఆయన పేర్కొన్నారు. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్‌, భూదాన్‌ పోచంపల్లి ప్రాంతాల్లో 40కి పైగా ఫార్మా కంపెనీలు ఉన్నాయని.. ఇవన్నీ హానికరమైన వ్యర్థాలను నదిలోకి విడిచిపెడుతున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ నదుల పరిరక్షణ పథకంలో భాగంగా మూసీ ప్రక్షాళనకు చర్యలు తీసుకోవాలని మోదీని కోమటిరెడ్డి కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని