MP Raghurama: అమరావతిపై మరోసారి అరాచకం: రఘురామ

ఆర్‌ 5 జోన్‌ నోటిఫికేషన్‌తో అమరావతిపై తమ ప్రభుత్వం మరోసారి అరాచకానికి పాల్పడిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు.

Updated : 23 Mar 2023 07:35 IST

ఈనాడు, దిల్లీ: ఆర్‌ 5 జోన్‌ నోటిఫికేషన్‌తో అమరావతిపై తమ ప్రభుత్వం మరోసారి అరాచకానికి పాల్పడిందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. దిల్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధానిలో పనులు చేయాలని న్యాయస్థానం చెబితే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం 900 ఎకరాల్లో గుడిసెలు వేసుకోవచ్చంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి ఏ హక్కు ఉందని ఆ భూమిని పంచుతారని ప్రశ్నించారు. అమరావతి రాజధాని అని న్యాయస్థానం తీర్పు ఇస్తే అప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తారన్నారు. ప్రభుత్వ నిర్ణయం హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని