Published : 25 May 2022 14:08 IST

Raghurama: కోనసీమ జిల్లా పేరుపై ప్రజాభిప్రాయం సేకరించండి: రఘురామ

దిల్లీ: ఎక్కువ మంది కోరుకున్న వ్యక్తే సీఎం అయినప్పుడు.. ఎక్కువ మంది కోరిక మేరకు కోనసీమ జిల్లా పేరుపై నిర్ణయం తీసుకోవాలని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. కోనసీమ జిల్లా పేరుపై నిన్న అమలాపురంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘జిల్లాల పేర్ల మీద గతంలో వివాదాలు, చర్చలు జరిగినప్పుడు చాలా చోట్ల ప్రజాభిప్రాయం తీసుకున్నారు. అలాంటప్పుడు కోనసీమపై వచ్చిన ప్రజాభిప్రాయం ఏమిటి? ప్రజాభిప్రాయం అప్పుడే ఇలా ఉంటే.. ఆ సమయంలోనే ఇలా ఎందుకు పేరు పెట్టలేదు? అంబేడ్కర్‌ను అభిమానించని వ్యక్తి ఏ కులంలోనూ ఉండరు. అన్నికులాలు ఆరాధించే వ్యక్తి అంబేడ్కర్‌. ప్రజాస్వామ్యంలో మెజార్టీ ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి.

జగన్‌ నిర్ణయాన్ని అందరూ సమర్థిస్తున్నారా? లేక వ్యతిరేకిస్తున్నారా? అని ప్రజాభిప్రాయం సేకరించండి. నిజంగా జనం ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి అమలాపురం మొత్తం కాకపోయినా లాటరీలో కొన్ని ప్రాంతాలను ప్రజల ముందు నిర్ణయించండి. ఆ ప్రాంతాల్లో కనీసం లక్షకు తక్కువ కాకుండా ఓటింగ్‌ పెట్టండి. మళ్లీ ఈవీఎంలు వద్దు. వాటిపై జనాలకు ఈ మధ్య నమ్మకం పోతోంది. బ్యాలెట్‌ విధానంలోనే ఓటింగ్‌కు వెళ్లండి. పెద్ద కష్టం కాదనుకుంటే జిల్లా మొత్తం ఓటింగ్‌ పెట్టండి.

ఓటింగ్‌లో వచ్చిన ప్రజాభిప్రాయాన్ని అందరూ గౌరవిస్తారు. ఆ తర్వాత దీనిపై ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉండదు. ప్రభుత్వ సలహాదారు సజ్జలతో అన్నం సాయి అనే వ్యక్తి ఫొటోలు దిగారు. విశ్వరూప్‌ తిరిగి మంత్రి అయిన సమయంలో అమలాపురంలో అతను ఫ్లెక్సీలు కట్టారు. నిన్న అమాలపురంలో జరిగిన దాడుల్లో అతనే ప్రముఖ పాత్ర వహించాడని.. ఆ వ్యక్తి వైకాపా నాయకుడు అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు’’ అని రఘురామ అన్నారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని