Raghurama: ఆర్మీ ఆసుపత్రికి రఘురామ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేక

Updated : 18 May 2021 04:57 IST

హైదరాబాద్‌: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు గుంటూరు జిల్లా జైలు నుంచి ప్రత్యేక వాహనంలో ఆయనను రోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌కు తరలించారు. దీంతో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. సోమవారం రాత్రి ఆర్మీ ఆసుపత్రిలో రఘురామకు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మంగళవారం పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వైద్యపరీక్షలను వీడియో తీయాలని.. నివేదికను సీల్డ్‌ కవర్‌లో అందించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలయ్యేలా ఏపీ సీఎస్‌ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు ఆదేశాలతో వైద్య పరీక్షల పర్యవేక్షణకు తెలంగాణ హైకోర్టు నియమించిన న్యాయాధికారి సైతం ఆర్మీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ నెల 21 వరకు రఘురామకృష్ణరాజు ఆర్మీ ఆసుపత్రిలో ఉండే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని