Raghurama: అక్రమ కేసులు ఆపాలి: రఘురామ

ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీసు కేసుల నమోదు ఆపాలని ఎంపీ రఘురామ కోరారు. నవ సూచనల పేరుతో సీఎం జగన్‌కు లేఖ రాస్తున్న ఎంపీ ఇవాళ రాసిన లేఖలో సెక్షన్‌ 66ఏ..

Updated : 07 Jul 2021 11:37 IST

దిల్లీ: ఐటీ చట్టం సెక్షన్‌ 66ఏ కింద ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పోలీసు కేసుల నమోదు ఆపాలని ఎంపీ రఘురామ కోరారు. నవ సూచనల పేరుతో సీఎం జగన్‌కు లేఖలు రాస్తున్న ఎంపీ ఇవాళ రాసిన లేఖలో సెక్షన్‌ 66ఏ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో సోషల్‌ మీడియా కార్యకలాపాలపై ఈ చట్టం ప్రకారం విచ్చలవిడిగా తప్పుడు కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. ఈ చట్టాన్ని 2015లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినా పోలీసులు అదే సెక్షన్‌పై కేసులు నమోదు చేయడంపై ఇటీవల సుప్రీం కోర్టు నోటీసులు కూడా ఇచ్చిందన్నారు. 

‘‘చట్ట విరుద్ధ చర్యలను తక్షణమే నిలుపుదల చేయకపోతే భరించే శక్తిలేని ప్రజలు మన ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే అవకాశం కన్పిస్తోంది. నా పార్లమెంటు నియోజకవర్గం సహా.. రాష్ట్రంలో మరికొన్ని చోట్ల కూడా జరుగుతున్న కొన్ని సంఘటనలను తలచుకుంటే బాధేస్తోంది. ఎవరైనా నా ఫొటోను వారి ఫోన్‌లో డిస్ ప్లే చేసినా, మెసేజింగ్ యాప్‌లలో వాడుకున్నా వారిని పోలీసు స్టేషన్కు పిలుస్తున్నారు. చాలా సందర్భాలలో బాధిత ప్రజలు న్యాయస్థానాలకు వెళ్లడం లేదు కాబట్టి పోలీసులు యథేచ్ఛగా అదృశ్య శక్తి ఆదేశాలు అమలు చేస్తున్నారు’’ అని రఘురామ లేఖలో పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని