Raghurama: ఆ సమాచారం ఇస్తే.. ₹కోటి రివార్డు ఇవ్వండి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సమాచారం ఇచ్చేవారికి ప్రాణ భయం తప్పకుండా ఉంటుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ ......

Published : 22 Aug 2021 01:07 IST

సీబీఐని కోరిన వైకాపా ఎంపీ రఘురామ

దిల్లీ: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సమాచారం ఇచ్చేవారికి ప్రాణ భయం తప్పకుండా ఉంటుందని వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజు అన్నారు. సీబీఐ ప్రకటించిన రూ.5లక్షల రివార్డు ఏమూలకు సరిపోతుందని ప్రశ్నించారు. సమాచారం అందించేవారికి రూ.కోటి రివార్డు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. వివేకానంద హత్య కేసు సత్వర విచారణలో భాగంగానే  సీబీఐ రివార్డు ప్రకటించి ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు.

మరోవైపు, వివేకా హత్య కేసుకు సంబంధించి సమాచారం అందిస్తే రూ.5లక్షలు రివార్డు ఇస్తామని సీబీఐ పత్రికా ప్రకటన ఇచ్చింది. కచ్చితమైన, నమ్మదగిన సమాచారం ఇచ్చినవారికి రివార్డు అందజేస్తామని స్పష్టం చేసింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కూడా సీబీఐ అధికారులు భరోసా ఇచ్చారు. వారు ఫోన్‌ నంబర్ల ద్వారా కానీ, కార్యాలయంలో గానీ తమను సంప్రదించవచ్చని తెలుపుతూ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని