Telangana News: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన చేవెళ్ల ఎంపీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేయాలని తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి సవాల్‌ విసిరారు...

Published : 28 Feb 2022 01:14 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేవెళ్ల నుంచి పోటీ చేయాలని తెరాస ఎంపీ రంజిత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. నిన్న పరిగిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మన ఊరు- మన పోరు’ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి తెరాస నేతలపై  చేసిన విమర్శలను రంజిత్‌రెడ్డి ఖండించారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవుపలికారు. తాను కోడిగుడ్ల వ్యాపారం చేస్తే తప్పా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో హుందాగా ఉంటున్నానని రంజిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం కేంద్రం పోరాడుతున్నామని, రేవంత్‌కు చేతనైతే  పార్లమెంట్‌లో తమతో కలిసి కొట్లాడాలని సూచించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని