ap news:త్వరలో విశాఖ నుంచి పాలన

త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈమేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు

Published : 03 Jun 2021 01:16 IST

విశాఖపట్నం: త్వరలోనే విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన ప్రారంభమవుతుందని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ఈమేరకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబుతో కలిసి బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...  ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పాలన సాగించవచ్చన్నారు. సీఆర్డీఏ కేసుకు, రాజధాని తరలింపునకు ఎలాంటి సంబంధం లేదన్నారు. పరిపాలన రాజధాని విశాఖ తరలించేందుకు అతి త్వరలో ఏర్పాట్లు జరుగుతాయని వెల్లడించారు.

 రాజధాని తరలించే తేదీ మాత్రం అడగవద్దని మీడియాను కోరారు. విశాఖను మురికి వాడలరహిత నగరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. కైలాసగిరి-భోగాపురం మధ్య 6 వరుసల రహదారి వస్తుందని తెలిపారు. జీవీఎంసీలో 98 వార్డుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. ముడసర్లోన పార్కును మరింత అందంగా  తీర్చిదిద్దుతామన్నారు. పంచగ్రామాల సమస్య కోర్టులో ఉందని, తీర్పు రాగానే పట్టాలిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని