UP Polls: యూపీలో భాజపాకు వరుస షాక్‌లు

రాజకీయంగా అత్యంత ప్రాధాన్యమైన ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార భాజపాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి.

Published : 13 Jan 2022 12:46 IST

పార్టీని వీడిన మరో ఎమ్మెల్యే.. ఏడుకు చేరిన సంఖ్య

లఖ్‌నవూ: ఉత్తర్‌ ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అధికార భాజపాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు మంత్రులు వైదొలగగా.. తాజాగా మరో ఎమ్మెల్యే ముఖేశ్ వర్మ భాజపాను వీడారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. దాంతో గత మూడు రోజులుగా కొనసాగుతోన్న నిష్క్రమణల సంఖ్య ఏడుకు చేరింది.

‘స్వామి ప్రసాద్‌ మౌర్య మా నేత. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేం మద్దతు ఇస్తాం. రానున్న రోజుల్లో మరికొంత మంది మాతో చేరనున్నారు’ అని భాజపాను వీడిన అనంతరం ముఖేశ్ మీడియాతో వ్యాఖ్యానించారు. షికోహాబాద్ ఎమ్మెల్యే అయిన ఆయన కూడా బీసీ వర్గం నేతే. భాజపా సర్కారులో దళితులు, వెనుకబడిన వర్గాలకు సముచిత న్యాయం జరగలేదంటూ స్వామి ప్రసాద్‌ మౌర్య, దారా సింగ్ చౌహాన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ముఖేశ్ కూడా తన రాజీనామా లేఖలో అవే కారణాలను ప్రస్తావించారు. వీరంతా సమాజ్ వాదీ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని