Ts News: రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు తూట్లు పొడిచిన తెరాస సర్కార్: ఎమ్మెల్యే సీతక్క

ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర

Published : 12 Jan 2022 15:56 IST

హైదరాబాద్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటమాడుతున్న 317 జీవోను వెంటనే రద్దు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. తెలంగాణ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై చేపట్టిన నిరసన కార్యక్రమంలో సీతక్క పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యే సీతక్క, వెంకట్‌ను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. పోలీసుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ... పోలీసు స్టేషన్‌లోనూ సీతక్క ఆందోళన కొనసాగించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఉద్యోగుల పాలిట యమపాశంగా మారిందన్నారు. జీవో 317 ప్రకారం రికార్డ్ చేయబడిన ఆదివాసీ ఉద్యోగులకు స్థానికంగానే బదిలీల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. రోస్టర్ విధానం పాటించకుండానే రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు తెరాస సర్కార్ తూట్లు పొడిచిందని ధ్వజమెత్తారు. ఉద్యోగుల ప్రాణాలు తీస్తున్న ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మల్టీ జోనల్ పోస్టుల విషయంలో ఉద్యోగ సంఘాలతో చర్చించి.. అందరికీ ఆమోదయోగ్యమైన బదిలీలను చేపట్టాలని సీతక్క కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని