మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేయలేదంటూ తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా వర్గీయుల దాడి!

పల్నాడు జిల్లా దాచేపల్లిలో తెదేపా కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై దాడి జరిగింది. వైకాపాకు చెందిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌

Updated : 02 May 2022 11:27 IST

దాచేపల్లి: పల్నాడు జిల్లా దాచేపల్లిలో తెదేపా కార్యకర్త కనిశెట్టి నాగులు ఇంటిపై దాడి జరిగింది. వైకాపాకు చెందిన మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ రమాదేవి భర్త, కుమారులు, బంధువులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇంటి వద్ద ఫర్నిచర్‌ను వైకాపా నేతలు ధ్వంసం చేశారు. నాగులు కుటుంబసభ్యులు ప్రాణభయంతో ఇంట్లోకి వెళ్లి తాళాలు వేసుకున్నారు. పోలీసులు సమాచారం అందుకుని చేరుకోవడంతో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ వర్గీయులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటేయలేదనే కక్షతోనే దాడికి చేశారని బాధితులు ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని