Munugode Bypoll: మునుగోడులో ప్రారంభమైన పోలింగ్‌

తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో సాయంత్రం 6 గంటల వరకు ఓటర్ల తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.

Published : 03 Nov 2022 07:41 IST

మునుగోడు: తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో సాయంత్రం 6 గంటల వరకు ఓటర్ల తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ఓటర్లు ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 

మొత్తం ఏడు మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేశారు. తెరాస, భాజపా, కాంగ్రెస్‌, బీఎస్పీ, తెజసతోపాటు వివిధ పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 47 మంది బరిలో ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పోలింగ్ ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు