Bjp: భాజపాలో చేరిన ముస్లిం నాయకురాలు

ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ(భాజపా)కి ఈ మధ్య ముస్లింల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తాజాగా ముస్లిం నాయకురాలు, మహిళల హక్కుల కార్యకర్త నిదా ఖాన్‌ భాజపాలో అందరినీ

Published : 30 Jan 2022 19:27 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. భారతీయ జనతా పార్టీ(భాజపా)కి ముస్లింల నుంచి కూడా మద్దతు లభిస్తోంది. తాజాగా ముస్లిం నాయకురాలు, మహిళల హక్కుల కార్యకర్త నిదా ఖాన్‌ భాజపాలో అందరినీ ఆశ్చర్యపర్చారు. ఆమె కాంగ్రెస్‌ మద్దతుదారుడు, ఇత్తిహద్‌ ఇ మిల్లాట్‌ కౌన్సిల్‌ చీఫ్‌ మౌలానా తాఖీర్‌ రజా ఖాన్‌ కోడలు.. ట్రిపుల్‌ తలాక్‌ బాధితురాలు.

భాజపా కండువా కప్పుకున్న అనంతరం నిదా ఖాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. ట్రిపుల్‌ తలాక్‌ను నిషేధించి తమకు అండగా నిలిచారని చెప్పారు. ‘‘ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టాన్ని తీసుకొచ్చి భాజపా గొప్ప పని చేసింది. నా జీవితంలో ఈ చట్టం ఓ కీలక మలుపుగా నిలిచింది. అందుకే, భాజపాకు మద్దతిస్తున్నా. ఇతర పార్టీలు మహిళల సాధికారత, వారి భద్రతపై కేవలం నినాదాలే ఇస్తున్నాయి. భాజపా మాత్రమే చేసి నిరూపించింది’’అని నిదా ఖాన్‌ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ముస్లిం మహిళలంతా భాజపాకే ఓటు వేస్తారని, రాష్ట్రంలో మళ్లీ భాజపానే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నిదా ఖాన్‌తోపాటు ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పలువురు నేతలు సైతం కమలదళంలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని